కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటిన తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్ : మానవ మనుగడకు చెట్లు జీవనాడుల అని బిఆర్‌ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు అన్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్రానికి చెందిన ఎంపిలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం లోక్ సభ పక్షనేత నామానాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉండే ఢిల్లీ ఇవ్వాల కాలుష్య ఖార్ఖానాగా మారిపోయింది. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉందన్నారు. మరో ఎంపి దామోదర్ రావు మాట్లాడుతూ మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. మనిషి శాశ్వతం కాదు.. కానీ భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజల హృదయంలో పదిలంగా ఉంటాయి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి మా ఎంపీలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ కాలుష్యంతో తల్లడిల్లుతున్న ఢిల్లీలో కెటిఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా తమ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని, జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న హరిత యజ్ఞంలో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పార్థసారధి రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, లోక్‌సభ సభ్యులు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్ రాఘవ,కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల నివాసంలో : మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బంజారాహిల్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డిలు, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు,శాసనసభ్యులు యన్.రవీంద్రనాయక్, గాధరి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,యన్.భాస్కర్ రావు,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఫైళ్ల శేఖర్ రెడ్డి,రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సారధి స్టూడియోలో: మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమీర్‌పేట సారధి స్టూడియోలో సినీ నటుడు అలీ మొక్కను నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కను నాటి మంత్రి కెటిఆర్‌కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం హీరో శ్రీకాంత్, ఉమ,ఉత్తేజ్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నటుడు అలీ విసిరారు.
జిహెచ్‌ఎంసిలో : మంత్రి కెటిఆర్ జన్మదినం పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి అర్భన్ ఫారెస్ట్ ఓఎస్‌డి కృష్ణ తన బృందంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్‌లో 47 మొక్కలు నాటారు. కార్యక్రమంలో శ్రీనివాస్, మేనేజర్ బాలయ్య, సిబ్బంది, కాలనీ సభ్యులు పాల్గొన్నారు
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో: మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాయంలోని ఆర్ట్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు కడారి స్వామి యాదవ్, జంగం అవినాష్, చటారి దశరథ, జంగయ్య, రమేష్, రవి నాయక్, సిగం వెంకటేష్. విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో: కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలంగాణ భవన్‌లో ఎంకెజి అధినేత డా. రవీందర్ నాయక్ ,ఓయూ గిరిజన రాష్ట్ర నేత డా. బి.సంజీవ్ నాయక్ మొక్కలను నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌నాయక్, డాక్టర్ శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.