Wednesday, January 22, 2025

ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో చెట్లకు బంతిపూల అలంకరణలు
గుజరాతీ పద్ధతిలో జి 20 స్వాగతం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జి 20 సదస్సు దారి పొడవునా బంతిపూల దండలు అమర్చిన చెట్లు అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి. విదేశీ అతిధులు సదస్సు స్థలికి, తమ బసలకు వెళ్లే దారిలో అలంకృత వృక్షాలు కన్పిస్తున్నాయి. ముదురు గోధుమ, ఆకుపచ్చ, నారింజ రంగు ఛాయలతో చెట్లు మెరిసిపోతున్నాయి. పాలం టెక్నికల్ ఏరియా, ఎస్‌పి మార్గ్, రాజ్‌ఘాట్ ఇతర ప్రధాన కూడళ్లలో చెట్ల మానులకు బంతిపూల దండలు చుట్టి ఉంచారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సూచనల మేరకు ఈ బంతిపూల దండలను అమర్చినట్లు అధికారులు తెలిపారు.

ఇది అతిధులకు స్వాగతం చెప్పడంలో గుజరాతీ సాంప్రదాయం. దీనిని ఇక్కడ అమలు పరుస్తున్నామని , బంతిపూలు కళాత్మకతకు, పర్యావరణ హితానికి మరింత వన్నె తెస్తాయని గత వారం సక్సేనా వార్తా సంస్థలకు తెలిపారు. దారిపొడవునా చెట్లను ముస్తాబు చేసే పనులను వివిధ సంస్థలకు అప్పగించారు. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు, పిడబ్లుడి ఇతర సంస్థలు చెట్లను , విద్యుత్ స్తంభాలను వివిధ రీతులలో అలంకరించి, వచ్చిపొయ్యే వారిని ఆహ్లాదపర్చే బాధ్యతలు తీసుకున్నాయి. వేలాదిగా చెట్లు ఇప్పుడు పెళ్లి కూతుర్ల వోలె కన్పిస్తున్నాయి. ఢిల్లీ రహదారులు, ప్రధాన కూడళ్లు ఇంతకు ముందెప్పుడూ లేని శోభను సంతరించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News