Wednesday, January 22, 2025

మొక్కలు నాటిన చిన్నారి కొనుకటి ఆధ్యారెడ్డి

- Advertisement -
- Advertisement -

Trees planted in Green India challenge event

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి లో తమ వ్యవసాయ క్షేత్రం లో చిన్నారి కొనుకటి ఆధ్యా రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు తాతయ్య మాజీ జెడ్‌పిటిసి లచ్చి రెడ్డి, నాన్నమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అవకాశం కల్పించిన సంతోష్ అంకుల్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : నేహా చౌదరి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. రోజు రోజు ప్రముఖులు పాల్గొన్ని మొక్కలు నాటి వాటి అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో బిగ్‌బాస్ 6 కంటెస్టెడ్ నేహా చౌదరి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నేహా చౌదరి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే నేను ఇంతటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం మనసుకు చాలా ఉత్సహాన్ని ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపి సంతోష్ కుమార్‌కు ధన్యవాదములు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంల తీసుకెళ్తూ ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

‘మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి…’

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు సురేష్, పోలీసు బృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మూడు మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో 100కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నామన్నారు. ఇప్పుడు ఉన్న కాలుష్యానికి ఎంత మొక్కలు ఎక్కువ నాటితే అంత మంచిదన్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడాలన్నా, సకల జీవరాశులను మనం కాపాడుకోవాలన్న మొక్కలు పంచక తప్పదన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాదాపూర్ సిఐ రవి, రాయదుర్గం సిఐ తిరుపతి, చందానగర్ సిఐ కాస్త్రో వీరి ముగ్గురిని కూడా మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News