Friday, December 20, 2024

మరిన్ని వృక్షాలను రీలోకేట్ చేస్తాం: జోగినిపల్లి

- Advertisement -
- Advertisement -

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో మరిన్ని వృక్షాలను రీలోకేట్ చేస్తాం – రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్”

రంగారెడ్డి: సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఇవాళ వట ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో శంషాబాద్ దగ్గర రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న 20 వృక్షాలను దిగ్గజ దర్శకుడు యస్.యస్.రాజమౌళి నల్గొండ ఫాంహౌజ్ లో, మరో 15 మొక్కలను వివిధ చోట్ల నాటారు.

Also Read: ఎంఎల్‌ఎ చెంప చెళ్లుమనిపించిన మహిళ

అనంతరం మాట్లాడిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఒక్క మాట అడగగానే తన ఫాంహౌజ్ లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించిన రాజమౌళి సహృదయతకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వృక్షాలను రీలోకేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. చెట్లు నాటడం మాత్రమే కాదు వాటిని కాపాడటంలోనూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చూపిస్తున్న అమితమైన చొరవపై ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఫౌండర్ మెంబర్ రాఘవ, వట ఫౌండేషన్ ఉదయ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News