Monday, December 23, 2024

మొక్కలను నాటి కేసీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ ఇద్దాం..ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారంనాడు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ‘ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం…  తెలంగాణా జాతిపితకు జన్మదిన కానుక ఇద్దాం. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న వృక్షార్చనలో పాల్గొనండి’ అంటూ సంతోష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మూడేసి మొక్కలను నాటి, ఆ  మొక్కలతో సెల్ఫీలు తీసుకుని 9000365000 నంబర్ కు వాట్సాప్ చేయాలని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News