Monday, December 23, 2024

ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ ఎగుమతికి అనుమతి ఉందా?: అరవింద

- Advertisement -
- Advertisement -

అమరావతి: 2019 తరువాత సేఫ్ కంపెనీ వైసిపి నేతల చేతుల్లోకి వెళ్లిందని టిడిపి నేత చదలవాడ అరవింద బాబు తెలిపారు. చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో సేఫ్ ఫార్మా కంపెనీ దగ్గర టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చదలవాడ మీడియాతో మాట్లాడారు. కోడెల కుటుంబం నుంచి వైసిపి నేత శ్రీధర్ రెడ్డి కొన్నారని, మోతాదుకు మించి మత్తు కలిపి మందులు తయారు చేస్తున్నారని విమర్శించారు. అనుమతి లేకుండా ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ ఎగుమతి చేస్తున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎగుమతిలో వైసిపి నేతలకు ముడుపులు అందుతున్నాయని మండిపడ్డారు. సేఫ్ ఫార్మాకంపెనీలో వైసిపి నేత శ్రీధర్ రెడ్డికి మెజారిటీ వాటా ఉందని, కరోనా సమయంలో 200 కోట్ల విలువైన ట్యాబ్లెట్స్ విదేశాలకు సరఫరా చేయడంతో ముంబయి కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేయడంతో పల్నాడు జిల్లా వైసిపి ప్రజాప్రతినిధుల్లో అలజడి మొదలైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News