Sunday, December 22, 2024

వణికిన జపాన్

- Advertisement -
- Advertisement -

టోక్యో : కొత్త సంవత్సరం 2024 ఆరంభం నాడే ద్వీపదేశం జపాన్ పలు తీవ్రతర భూకంపాల తాకిడికి గురైంది. సోమవారం అత్యంత తీవ్రస్థాయి భూకంపాలతో జపాన్ చిగురుటాకుల వణికింది. దీనితో గంటల తరబడి జనం ఇళ్లు వదిలి వీధుల పాలయ్యారు.ఈ దశలోనే ముందుగా భీకర సునా మీ తాకిడి హెచ్చరికలు వెలువడ్డాయి. తరువాత వీ టి తీవ్రతను తగ్గిస్తూ ప్రకటనలు జారీ అయ్యాయి. అయితే ప్రజలంతా సోమవారం బయటే ఉండాల ని, ఇళ్లకు వెళ్లవద్దని అధికారులు వారిని అప్రమ త్తం చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను ఘనం గా ఉత్సాహంగా నిర్వహించుకోవాలనే తపనతో ఉన్న జపనీయులు అతి తీవ్ర స్థాయి రెక్టర్ స్కేలుపై 7.6స్థాయిలో ప్రకంపనలతో నీరుగారారు.

తొలుత సంభవించిన భూప్రకంపనలతో జపాన్ ప్రధాన దీవి పశ్చిమ తీరం వెంబడి ఉన్న భూ ఉపరితల కేంద్రాల్లో కల్లోల పరిస్థితి ఏర్పడింది. భూ మి పొరల్లో రగులుకున్న అగ్గి చివరికి ఈ ప్రాం తంలో పలు భవనాల కుప్పకూల్చాయి. హోంషూ ప్రధాన దీవికి సమీపంలో అతి పెద్ద భూకంప కేం ద్రం రికార్డు అయింది. జపాన్‌కు భూకంపాలు స ర్వసాధారణం అయినా, ఇప్పటి తీవ్రస్థాయి వరు స ప్రకంపనలు భయానక స్థితికి దారితీశాయి. పలు భవనాల పతనంతో ఎంత మంది దుర్మరణం చెందారు? ఏ మేరకు ఆస్తినష్టం జరిగింది? అనే వివరాలు వెంటనే వెల్లడికాలేదు. అయితే జపాన్ ఐషికవా తీరం వెంబడి సముద్రానికి దూరంగా డ జన్‌కు పైగా భూకంపాలు చోటుచేసుకున్నట్లు జపాన్ వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతం తరువాత మిగిలిన ప్రాంతాలలో కూడా మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో భూ కంపం చోటుచేసుకుంది. ఎడతెరిపిలేని భూకంపాలతో జనం బెంబేలెత్తారు. అరాచక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆరు భవనాలు ధ్వంసం అయినట్లు, వీటిలో అనేకులు కూరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. జపాన్‌లోని కొన్ని నిర్థిష్ట జిల్లాల్లో భూకంపాలతో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ప్రత్యేకించి వాజిమా నగరంలో వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.

దాదాపు 50 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో జనం అంధకారంలో గడపాల్సి వచ్చింది. భూకంపాల తీవ్రతల నేపథ్యంలో ముందు పెను సునామీ అలర్ట్‌లు వెలువరించారు. ఇషికావా ప్రాంతానికి భీకర సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని దీవులకు తక్కువ స్థాయి ఆటుపోట్ల ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఉత్తరాది దీవి హోకాయిడో లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సముద్ర కెరటాలు దాదాపు 10 అడుగుల ఎత్తు వరకూ తరలివస్తాయని పేర్కొన్నారు. ఇంతకు ముందు అనుకున్న దాని కన్నా సునామీ తీవ్రత తగ్గుముఖం పట్టిందని వివరించారు. ముందుగా ఇవి 17 అడుగుల వరకూ వస్తాయని తెలిపారు. జపానీ అధికారిక టీవీ ఎన్‌హెచ్‌కె టీవీ భూకంప పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష వార్తాకథనాలు వెలువరించింది. దీనితో భూకంపాల తీవ్రత వెల్లడైంది. సునామీ అలలు ఎప్పుడైనా పదేపదే విరుచుకుపడుతాయని, ప్రజలు ఆద్యంతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓ వైపు సునామీ భయాలు , పదేపదే పలు ప్రకంపనలతో జనం ఏడాది ఆరంభం అంతా అయోమయం అయింది. తీర ప్రాంతాల వారికి సునామీ క్లిష్టత పొంచి ఉందని అధికారులు తెలిపారు. ప్రతి నిమిషం విలువైనదే . సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికార ప్రతినిధి హయాషి తెలిపారు. ఇప్పటికైతే భూకంపాలు, సునామీ పరిస్థితితో మృతుల సమాచారం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని వివరించారు. బాధిత ప్రజలను పెద్ద ఎత్తున స్టేడియంలకు , విద్యాలయాలకు తరలించారు. వారికి అక్కడ కొద్దిరోజుల బస ఏర్పాటు చేశారు.
వీధులలో జనం ఉరుకులు పరుగులు..
భూకంపం తాకిడితో పలు ప్రాంతాల్లో జనం వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలను జపాన్ టీవీ మాధ్యమాలు వెలువరించాయి. నివాసిత ప్రాంతాలలో భూమి పొరల్లో నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలతో దట్టమైన ఎరుపు పొగలు కమ్ముకున్నాయి. వీటిని ఇంతవరకూ తాము ఎప్పుడూ చూసి ఉండలేదని స్థానికులు తెలిపారు. రోడ్ల పక్కన పగుళ్లుబారిన నేల వద్ద జనం గుంపులుగుంపులుగా నిలబడి ఉండటం, వీరిలో ఓ తల్లి తన బిడ్డను చంకలో ఎత్తుకుని ఉండటం వంటి దృశ్యాలు కన్పించాయి. పరుగులు తీస్తున్న దశలో కొందరు కిందపడిపోవడంతో గాయాల పాలయ్యారు . ఇళ్లలోని వారిపై సామాన్లు మీదపడ్డాయి. భూకంప తాకిడి ప్రాంతాలలో బుల్లెట్ ట్రైన్లు ఇతర రవాణా సౌకర్యాలు నిలిపివేయాల్సి వచ్చింది. దీనితో జనం రద్దీతో వీధులు కిక్కిరిసిపొయ్యాయి. కొన్ని జాతీయ రహదారులను పాక్షికంగా మూసివేశారు. కొన్ని చోట్ల నీటి పైపులు పగిలిపోవడంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు కట్టలు తెంచుకుంది.
పౌరుల భద్రతకు ప్రత్యేక కేంద్రం : ప్రధాని కిషిదా వెల్లడి
ప్రస్తుత పరిస్థితిపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా స్పందించారు. వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. భూకంపం , సునామీ సమాచారం సేకరణకు ప్రత్యేక సమాచార అత్యవసర కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌరుల భద్రత కీలకం. ఉపద్రవం గురించి ఎప్పటికప్పుడు శాస్త్రీయరీతిలో సమీక్షించుకుని, ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలకు ఈ ప్రత్యేక కేంద్రం ఉపయోగపడుతుంది. సోమవారం నాటి పెను భూకంపాలతో దేశంలోని ప్రధాన అణుకేంద్రాలకు ఎటువంటి కించిత్తు ముప్పు కూడా వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఇవి సక్రమంగా ఉన్నాయని వివరించారు. ఆయా ప్రాంతాలలో ఎక్కడ కూడా అణుధార్మిక స్థాయిల ప్రభావం లేదని అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News