Monday, December 23, 2024

‘గాలోడు’ టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

- Advertisement -
- Advertisement -

Tremendous response to 'Galodu' teaser

 

సుడిగాలి సుధీర్ ‍‍‍హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సాఫ్ట్‌వేర్ సుధీర్` సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. మళ్లీ ఇదే క్రేజీ కాంబినేష‌న్‌లో ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా `గాలోడు` చిత్రం రూపొందుతోంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ మోష‌న్‌ పోస్ట‌ర్‌లో సుధీర్ మాస్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల `గాలోడు` మూవీ టీజ‌ర్‌ని హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ అనాథాశ్ర‌మంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా క్లాస్ రోల్‌లో మెప్పించిన సుధీర్ గాలోడు టీజ‌ర్‌లో ప‌క్కా మాస్‌రోల్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక నిమిషం క‌న్నా త‌క్కువ నిడివి ఉన్న టీజ‌ర్‌లో మాస్ అండ్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. “అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్న వాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను” అనే డైలాగ్ తో ఈ సినిమాలో సుధీర్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో  హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన చిత్ర‌ యూనిట్ స్పెషల్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ – `సుధీర్ హీరోగా నేను డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ మూవీ `సాఫ్ట్‌వేర్ సుధీర్` క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. ఆ స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే  స్వీయ ద‌ర్శ‌కత్వంలో `గాలోడు` సినిమాను నిర్మిస్తున్నాను. టీజ‌ర్ విడుద‌లైన రోజు నుండి ఈ రోజు వ‌ర‌కూ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉండ‌డంతో మాకు సినిమాపై మ‌రింత కాన్పిడెన్స్ పెరిగింది. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రెండు పాట‌లు మిన‌హా టాకీపార్ట్ మొత్తం పూర్త‌య్యింది. ఆ రెండు పాట‌ల‌ను విదేశాల్లో చిత్రీక‌రించనున్నాం`అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News