Sunday, January 19, 2025

ఇండియాపై కివీస్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ 2023లో సెమీఫైనల్లో ఆడే జట్లేమిటో ఇప్పటికే తెలిసిపోయింది. ఊహించని అద్బుతం జరిగితే తప్ప, పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ టోర్నీనుంచి నిష్క్రమించినట్లే. కాబట్టి ఇండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ జట్లు సెమీస్ కు చేరినట్టే. మొదటి స్థానంలో ఉన్న జట్టు..  నాలుగో స్థానంలో ఉన్న  జట్టును సెమీస్ లో ఢీకొడుతుంది. అంటే ఇండియా, న్యూజీలాండ్ ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఖాయమన్నమాటే. నవంబర్ 15న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై కివీస్ టాప్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు.

‘ప్రపంచ కప్ లో ఓటమన్నదే లేకుండా ముందుకు దూసుకుపోతున్న ఇండియాకు కళ్లెం వేయడం కష్టమే. పైగా 140 కోట్ల మంది మద్దతు ఆ జట్టుకు ఉంది. అయినా కూడా మా వ్యూహం మాకు ఉంది. మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇండియాలోని పరిస్థితులు మా ఆటగాళ్లకు బాగా తెలుసు. గతంలో చాలాసార్లు ఇండియాతో ఆడాం’ అన్నాడు.

ఇంగ్లండ్ లో 2019లో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజీలాండ్ జట్టు ఇండియాపై గెలుపొందింది. ఆ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News