Tuesday, November 5, 2024

రెవెన్యూ శాఖలో మిగతా పదోన్నతులను వెంటనే చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

Tresa Leaders meet Smita sabharwal

 

డిఆర్‌ఓ పోస్టులను కొనసాగించాలి
సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు విజ్ఞప్తి చేసిన ట్రెసా నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్ : తహసీల్దార్‌లకు డిప్యూటీ కలెక్టర్‌లుగా, డిప్యూటీ కలెక్టర్‌లకు స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌లుగా పదోన్నతులు కల్పించాలని డిఆర్‌ఓ పోస్టులను కొనసాగిస్తూ ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌లు సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతోపాటు తహసీల్దార్ల విజ్ఞప్తి బదిలీలు, కొత్తగా రిక్రూట్‌మెంట్ అయి శిక్షణ పూర్తి చేసుకున్న నాయబ్ తహసీల్దార్‌లకు పోస్టింగ్ ఇవ్వాలని పలు అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. చాలా జిల్లాలో డిఆర్‌ఓ పోస్టు ఖాళీగా ఉండడంతో రెవెన్యూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, కలెక్టర్‌లకు పనిభారం పెరిగిందని ఆ పోస్టులో అర్హులను భర్తీ చేయాలని ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని వారు స్మితా సభర్వాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్మితా సభర్వాల్ మాట్లాడుతూ.. భూ వివాదాల నిమిత్తం ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రిబ్యునల్స్‌తో పాటు తహసీల్దార్‌ల చేస్తున్న ధరణి రిజిస్ట్రేషన్‌లకు స్పందన బాగుందని ఆమె వారితో పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సేవలను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News