ముంబయి: ఆర్యన్‌ఖాన్(23) బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో బుధవారం కూడా విచారణ జరగనున్నది. మంగళవారం ఆర్యన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహ్తగీ హైకోర్టులో వాదన వినిపించారు. ఆర్యన్ నుంచి ఎన్‌సిబి అధికారులు ఎలాంటి డ్రగ్స్‌నూ జప్తు చేయలేదని, ఆయన వాటిని వినియోగించినట్టు ఎలాంటి సాక్షం చూపలేకపోయారని రోహ్తగీ కోర్టు దృష్టికి తెచ్చారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్టయిన ఆర్యన్ 20 రోజులకుపైగా జైలులో ఉంటున్నారు. ఇదే కేసులో నిందితులైన అర్బాజ్‌మర్చంట్, మున్‌మున్‌ధమేచా బెయిల్ పిటిషన్లపైనా హైకోర్టులో బుధవారం విచారణ జరగనున్నది. బుధవారం ఎన్‌సిబి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్‌సింగ్ వాదన వినిపించనున్నారు.
డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్
ఇదే కేసులో నిందితులైన ఇద్దరికి ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. మనీశ్‌రాజ్‌గరియా, అవీన్‌సాహుల్‌లకు బెయిల్ ఇచ్చింది. వీరిద్దరూ ఈ నెల 2న క్రూయిజ్‌షిప్‌లో జరిగిన విందుకు అతిథులుగా హాజరయ్యారని ఎన్‌సిబి కోర్టుకు తెలిపింది. ఈ కేసులో 20మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసింది. ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎన్‌డిపిఎస్ కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.