Monday, December 23, 2024

సిద్దిపేటకు ప్యాసింజర్ రైలు.. ట్రయల్ రన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : సిద్దిపేటకు ప్యాసింజర్లతో కూడిన రైలు చుక్ చుక్ మంటూ శుక్రవారం సిద్దిపేట రైల్వే స్టేషన్‌కు ట్రయల్ రన్ తో దూసుకొచ్చేసింది. గతంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన నినాదాలను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు దశాబ్దాల సిద్దిపేట ప్రజల కలను నిజం చేశారు. రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసుకుని ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ అధికారులు మిట్టపల్లి వద్ద ఉన్న రైల్వే గేటును మూసివేసి వాహనదారులు అటూ ఇటూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సిద్దిపేటకు నీళ్లు, జిల్లా, రైలు వాగ్దానాలను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు నిజం చేశారు. ఇకపై సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు హైదరాబాదుకు వెళ్లకుండానే సిద్దిపేటలోనే రైలు ఎక్కి ప్రయాణం చేసే సౌకర్యం లభించింది. సిద్దిపేటలో ప్యాసింజర్ తో కూడిన రైలు కనబడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News