మన తెలంగాణ,సిటీబ్యూరో: వికలాంగ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించినప్పుడే మానసికంగా మరింత బలంగా తయారవుతారని సెవెన్ రే ఫౌండేషన్ సారా పేర్కొన్నారు. బుధవారం తుకారం గేట్ కొండారెడ్డినగర్ ప్రాంతంలో వికలాంగ మహిళలకు, యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలలో వికలాంగ మహిళలు ఆడుతూ, పాడుతూ ఈపోటీల్లో పాల్గొన్నారు. అనంతరం సారా మాట్లాడుతూ తమ ఫౌండేషన్ నుంచి ఇప్పటికి వికలాంగుల్లో మానసిక సైర్దాన్ని పెంపొందించేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వారిలో ఆనందం కోసం నిత్యం ఆట పాటలతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈవికలాంగుల సంక్రాంతి పోటీలో ప్రథమ బహుమతి బాలామణి, ద్వితీయ బహుమతి జ్యోతి, తృతీయబహుమతి మాదవి గెలుపొందారు. ఈకార్యక్రమంలో నవీన్, అంజుకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
వికలాంగ మహిళలకు ముగ్గుల పోటీలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -