Monday, December 23, 2024

తెలంగాణ వచ్చాకే అభివృద్ధి బాటలో గిరిజన ప్రాంతాలు

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే గిరిజన తాండాలు అభివృద్ధ్ది చెందాయని గిరిజన ప్రజాప్రతినిధులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం సదాశివనగర్ మండలం యాచారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ పంచాయతీ కార్యలయం నుంచి శ్రీ జగదాంబా దేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయలో ప్రత్యేక భోగ్‌బండార్ పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలనుద్దేశించి సర్పంచ్ లతా రమేష్ వివరించారు. తెలంగాణ ఉత్సవాలను పురష్కరించుకుని గిరిజనుల పోడు భూములకు పట్టాల రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. యా చారం పరిధిలో 110 మంది రైతులకు పోడు పట్టాలను ఈ నెల 24న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

తెలంగాణలో గిరిజన ప్రాంతాల అభివృద్ధ్దిని కొనియాడుతు గిరిజన సాంప్రదాయ వస్త్రాలు ధరించి మహిళలు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. నృత్యాలలో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. సర్పంచ్ లతా రమేష్, ఎంపిటిసీ సవిత సంగ్యా, కార్యదర్శి నాగరాజు, ఆలయ పూజారి రమేష్ మహారాజ్,తాండాపెద్ద సంతోష్ నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ మంగ్యానాయక్,ఉప సర్పంచ్ పంగిబాయి గోపిచంద్ లకు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దేవిసింగ్, బాబ్యనాయక్, హరిదాస్ నాయక్, బి.మంగ్యా నాయక్, బి.కిషన్‌నాయక్, మోనిసింగ్, మో జ్యానాయక్, భీందాస్, జైత్రాం, రాజేష్, వెంకి, రివి నాయక్, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు తాండావాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News