Wednesday, January 22, 2025

సిఎం రేవంత్ రెడ్డికి గిరిజన సంఘం అభినందనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డి, గిరిజన బిడ్డ సీతక్క తో పాటు మంత్రివర్గానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మనాయక్, ఆర్. శ్రీరాం నాయక్ లు ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గిరిజనులకు అనేక రకాల వాగ్దానాలు చేసినందున వాటి అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో పెంచిన రిజర్వేషన్ జిఓ 33ను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికి హక్కు పత్రాల పంపిణీ, మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో ఐటిడిఏల ఏర్పాటు, నూతనంగా ఏర్పడిన ప్రతి తండాల గ్రామపంచాయతీకి కోటి రూపాయలు చొప్పున నిధులు, తండాల అభివృద్ధి బోర్డు, ప్రత్యేక ఎస్‌టి కమిషన్ ఏర్పాటు, ఆదివాసీ గిరిజన తెగలవారీగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, ప్రతి గిరిజన కుటుంబానికి 15 లక్షల రుణాలు, వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఇండ్లు ఇండ్ల స్థలాలు, గిరిజన విద్య ఆరోగ్యం వంటి అంశాల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తక్షణం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News