Saturday, December 21, 2024

పోడు పట్టాలతో నెరవేరిన గిరిజనుల కల

- Advertisement -
- Advertisement -

భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలం కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల పురాణిపేట పల్లికొండ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తాళ్ళపల్లిలో పోడు పట్టాల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 1007 మంది లబ్ధ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీలో గిరి పుత్రులకు ఒక ఆస్తిత్వం, భరోసాను కల్పించిన గొప్ప నాయకుడు సిఎం కెసిఆర్ అడవి బిడ్డలకు ఆత్మ గౌరవం కల్పించిన మహానీయుడని సిఎం కెసిఆర్ అని అన్నారు. ఈ పట్టాలు గిరిజనుల తర తరాలకు భరోసాగా నిలుస్తాయి. రాష్ట్రంలో లక్ష 50వేల మంది గిరిజనులకు 4 లక్షల ఎకరాల పట్టాలు ఇస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 4300 మందికి 860 ఎకరాలు పాస్ బుక్కుల ద్వారా పంచబడుతుంది. గతంలో కేవలం భీమ్‌గల్ మండలంలోనే 4000 ఎకరాల అసైన్‌మెంట్ భూములు కూడా అర్హులకు ఇచ్చాము. వ్యవసాయం చేసుకునే సందర్భంలో అడవి బిడ్డలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట వేసిన నుండి ధాన్యం చేతికి వచ్చే వరకు ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల నుండి గౌరవ ప్రదంగా వ్యవసాయం చేసుకునే స్థాయికి తెచ్చిన మహనీయుడు కెసిఆర్. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎంతో సంతోష పడ్డానో గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తున్నావు అంతే సంతోషంగా ఉంది. పోడు పట్టాలతో పాటు రైతబంధు కూడా లబ్ధ్దిదారులకు అందజేస్తున్నందుకు గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్. తండాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి పరిస్థితి ఉండే ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చిందో చర్చ జరపాలి. గిరిజన తాండలో తీజ్ భవన్ నిర్మించేందుకు సిఎం కెసిఆర్‌కు విన్నవించిన త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నా.. అడవి బిడ్డలు ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి వేముల కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీవో డిఎఫ్‌ఓ, జడ్పిటిసి రవి, ఎంపిపి ఆర్మూర్ మహేష్, రైతుబంధు సమన్వయ అధ్యక్షులు శర్మనాయక్, తుక్కజి నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News