Sunday, April 6, 2025

కరెంట్‌ షాక్‌తో గిరిజన రైతు మృతి

- Advertisement -
- Advertisement -

ఉట్నూర్: పంటను అటవీ జంతువుల నుండి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగిలి గిరిజన రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎసై భరత్ సుమన్ తెలిపిన వివరాలు ప్రకారం… మండలంలోని మత్తడిగుడాకు చెందిన రైతు ఆత్రం గుణవంత్ రావ్(32) గురువారం రాత్రి తాను సాగు చేస్తున్న చెనుకు వెళ్ళాడు. పక్క చెనులో సాగు చేస్తున్న పంటలను అటవీ జంతువుల నుండి కాపాడుకునేందుకు సదరు రైతు చెను చుట్టూ కరెంట్ తీగను ఏర్పాటు చేశాడు. ఇది గమనించని గుణవంత్ రావ్ కరెంట్ తీగ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News