Wednesday, January 15, 2025

గిరిజన సమస్యలు పరిష్కరించాలి: గిరిజన సమాఖ్య వినతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకోని గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించాలని .తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ నాయక్ మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ను కలిసి ఈ మేరకు మెమొరాండం సమర్పించారు. రాష్ట్రంలో లక్షలాదిమంది గిరిజనులు ఆతృతతో ఎదురు చూస్తున్న పోడుభుముల హాక్కుపత్రాలను ఎలా పంపిణీ చేయనున్నారో స్పష్టత నివ్వాలని కోరారు.

ప్రభుత్వం జూన్ 24 నుండి 30 వరకు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు జిల్లా స్థాయిలో ఎక్కడ,ఎవరిద్వారా ఇస్తారో స్పష్టత లేదని, లబ్ధిదారుల జాబితా గోప్యంగా ఉంచడం వల్ల ఆందోళన నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినట్లు 11.50 లక్షల ఎకరాల పై హక్కులు కల్పించే విధంగా నోడల్ అధికారిగా ప్రభుత్వం పై వత్తిడి చేయాలని వారు క్రిస్టినా జెడ్ చోంగ్తూను కోరారు. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రైకార్ రుణాలను తక్షణం విడుదల చేయాలి,మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ట్రైకార్ యాక్షన్ ప్లాన్ ను ప్రకటించాలని కోరారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైనందున గురుకులాలు, కాలేజీ హాస్టల్స్ లో దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులందరికీ సీట్లు ఇవ్వాలని కోరారు. గురుకులాలు, హాస్టల్స్ విద్యార్థులకు భవనాలు సరిపడా లేనందున నూతన భవనాలను నిర్మించాలని, ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు అనుబంధంగా ప్రత్యేక హాస్టల్స్ భవనాలను నిర్మించాలని కోరారు. గిరిజన బెస్ట్ అవైలబుల్ పథకంలో ప్రతి ఏడాది 15 వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయ, సీట్లు మాత్రం 700ల వరకే భర్తీకి అవకాశం ఉన్నందున మరో 2000 సీట్లను తక్షణం పెంచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని జిల్లాల్లో అవినీతి అక్రమార్కులకు పాల్పడుతున్న డి టి డి ఓ లపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మానాయక్ .రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News