Wednesday, January 22, 2025

24న గిరిజన ఫైన్‌ఆర్ట్స్ స్కూల్ ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Tribal Fine Art School Entrance Test on 24th

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ గిరిజన గురుకుల ఫైన్ ఆర్ట్ స్కూల్‌లో 6వ తరగతిలో అడ్మీషన్ల కోసం ఈ నెల 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లోని ఈ ఫైన్ ఆర్ట్ స్కూల్‌లో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. అందులో 40 బాలురు, 40 బాలికలను కేటాయించడం జరిగింది. వీటిలో ప్రవేశాల కోసం 24న ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం వంటి గంట వరకు పరీక్ష నర్సాపూర్‌లో జరుగనుంది. 100 మార్కుల పేపర్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ కు సంబంధించి పరీక్ష ఉంటుంది. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం సొసైటి వెబ్‌సైట్ www.tgtwgurukulam.telangana.govi.inలో తనిఖీ చేసుకోవచ్చని గురుకుల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News