Sunday, January 19, 2025

గిరిజన నాయకుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

ఫుల్బాని (ఒడిశా): ఒడిశా లోని కాంధమాల్ జిల్లా సౌలిపడ గ్రామంలో బుధవారం రాత్రి సుబల్ కన్హార్ అనే గిరిజన నాయకుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. మృతుడు మాజీ సర్పంచ్. బుధవారం రాత్రి పది మంది సాయుధులైన మావోయిస్టులు మృతుడి ని ఇంటి నుంచి ఊరవతలకు తీసుకెళ్లి కాల్చి చంపారని ఫిరింగియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి తపన్ కుమార్ నహక్ వెల్లడించారు. మృతుడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అన్న అనుమానంతోనే ఈ అమానుషానికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.

మావోయిస్టుల నుంచి వరుసగా బెదిరింపులు రావడంతో కన్హార్ తన గ్రామాన్ని విడిచిపెట్టి బల్లిగుడ అనే గ్రామంలో గత నాలుగేళ్లుగా ఉంటున్నాడు. అయితే తన ఇంటికి సమీపాన కొత్తగా సిఆర్‌పిఎఫ్ శిబిరం ఏర్పాటుకావడంతో మళ్లీ రెండు నెలల క్రితమే స్వగ్రామానికి కన్హార్ చేరుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. ఈ హత్య తరువాత గ్రామస్థులు భయంతో గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఈ హత్య వెనుక ఎవరున్నారో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News