- Advertisement -
సూర్యాపేట: వీరశేఖర్ వ్యవహారంలో ఆత్మకూరు ఎస్ఐ లింగయ్య యాదవ్ పై వేటు పడింది. లింగయ్య యాదవ్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్ పి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆత్మకూరు(ఎస్)మండల పరిధిలోని రామోజీతాండాలో గిరిజన యువకుడు వీరశేఖర్ పై దొంగతనం ఆరోపణల మేరకు పోలీసులు చితకబాదిన ఘటన సంచలనంగా మారింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు గురువారం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం సీరియస్ కావడంతో ఎస్ఐ లింగయ్య యాదవ్ ను ఎస్పి బదిలీ చేశారు.
Tribal man incident: Atmakur SI Transferred
- Advertisement -