చర్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా విషాదాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి సమయంలో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి నిద్రిస్తున్న గిరిజనులను తొక్కేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, శ్యామలచెన్ను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంపెనగుడెం గ్రామ పరిసరాల్లో అక్రమ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న విష యం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇసుక ట్రాక్టర్లు వెళుతుండగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ నడిపి నిద్రిస్తున్న గిరిజనులపైకి దూసుకుని వెళ్లింది. దీంతో కు ంజంషన్ను అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యామల చెన్ను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దారుణ ఘటనపై స్థానిక గిరిజనులు, గ్రామస్తులు తీవ్రంగా స్పందించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గతం లో అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా,
చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చర్ల మండలంలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దు, అదుపు లేకుండా దూసుకుపోతోంది.అధిక లాభాల కోసం స్థానిక గిరిజనులను పట్టించుకోకుండా ట్రా క్టర్లతో అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. ఈ అక్రమ రవాణా వల్ల రహదారులపై ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని గిరిజన సంఘా లు, హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం గట్టిగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాజు వర్మ తెలిపారు.