Sunday, December 22, 2024

ఎపిలో గిరిజనుడిపై మూత్ర విసర్జన: 9 మందిపై కేసు

- Advertisement -
- Advertisement -

ఒంగోలు: ఒక బాలికతో సంబంధం పెట్టుకున్నందుకు ఒక గిరిజన యువకుడిని చిదకబాదిన 9 మంది వ్యక్తులు అతనిపై మూత్ర విసర్జన చేసినసంచలన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

జూన్ 19న మన్నం రామాంజనేయులు అనే ప్రధాన నిందితుడితోపాటు మరో 8 మంది వ్యక్తులు బాధితుడు నవీన్‌ను చితకబాదడంతోపాటు అతనిపై మూత్ర విసర్జన చేశారని, వీరిలో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్‌పి మల్లకా గర్గ్ తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రామాంజనేయులు కోసం గాలిస్తున్నామని ఎస్‌పి చెప్పారు.

రామాంజనేయులు, నవీన్ బాల్య స్నేహితులని, అయితే రామాంజనేయులు స్నేహితుడి బంధువైన ఒక బాలికతో సంబంధం పెట్టుకున్నందుకు నవీన్‌తో అతని మనస్పర్థలు వచ్చాయని ఎస్‌పి చెప్పారు. ఆ బాలికతో కలసి నవీన్ పారిపోగా అతనిపై పోస్కో కేసునోమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని, అతను రిమాండుకు కూడా వెళ్లాడని తెలిపారు. అయితే ఆ బాలికతో నవీన్ ఇంకా సంబంధాలు కొనసాగిస్తుండడం రామాంజనేయులుకు, అతని స్నేహితులకు ఆగ్రహం తెప్పించిందని, వారి మధ్య స్నేహం చెడిపోవడమేగాక ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని ఆమె తెలిపారు.

జూన్ 19న పాత గొడవలు మరచిపోదామని చెప్పి నవీన్‌ను రామాంజనేయులు పిలిపించాడని, వారిద్దరూ మద్యం సేవించగా రామాంజనేయులు మిత్రులు నివీన్‌పై దాడి చేయడంతోపాటు అతనిపై మూత్ర విసర్జన చేశారని ఆమె తెలిపారు. ఈ దాడి తర్వాత నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆసుపత్రిలో చేరాడని, అయితే మూత్ర విసర్జన గురించి చెప్పలేదని ఎస్‌పి చెప్పారు.

కాగా..పోలీసుల దర్యాప్తులో నవీన్‌పై నిందితులు మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటపడ్డాయని ఆమె చెప్పారు. గిరిజనుడైన నవీన్‌పై జరిగిన దాడి కావడంతో నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పోలీసులు తమంతట తాముగా నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు.

అయితే..ప్రధాన నిందితుడు రామాంజనేయులు, బాధితుడు నవీన్ స్నేహితులు కావడం, వారిద్దరూ కలసి అనేక నేరాలకు గతంలో పాల్పడడం కారణంగా ఈ దాడి వెనుక కుట్రకోణం ఉండే అవకాశం లేదని ఆమె తెలిపారు. వారిద్దరిపై 30కి కైగా కేసులు నమోదయ్యాయని, ఇద్దరూ హిస్టరీ షీటర్లేనని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News