Saturday, November 23, 2024

గిరిజనులకు గౌరవం దక్కింది ఇప్పుడే: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi


భోపాల్: స్వాతంత్య్రం కోసం సేవలందించిన గిరిజన సమాజానికి అసలైన గౌరవం దక్కిందిప్పుడేనని ప్రధాని మోడీ సోమవారం అన్నారు. “నేడు భారత్ తొలి ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’ జరుపుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి గిరిజనుల సంస్కృతి, స్వాతంత్య్రానికి వారు అందించిన సేవలకు గౌరవం దక్కిందిప్పుడే” అన్నారు. గిరిజనుల ఆరాధ్యుడైన బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ఇక నుంచి ‘జనజాతీయ గౌరవ దివస్’గా కేంద్రం నిర్వహిస్తుందని ప్రకటించారు. భోపాల్‌లో సోమవారం నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ దివస్’లో ప్రధాని పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్షం కారణంగానే గిరిజనులు వెనుకబడిపోయి ఉన్నారని అన్నారు.
గోండుల రాని దుర్గవతి సాహసం, రాణి కమలావతి త్యాగం వంటివి దేశం ఎప్పటికీ మరచిపోదన్నారు. సాహసవంతులైన భిల్లా జాతి గిరిజనులు లేకుండా మహారాణా ప్రతాప్ పోరాటంను ఊహించనన్నా లేమన్నారు. దేశానికి గిరిజనులు అందించిన సేవలను గత ప్రభుత్వం దేశానికి విశధంగా చెప్పలేదని, పరిమితమైన సమాచారాన్ని మాత్రమే ఇచ్చిందన్నారు. దేశ జనాభాలో గిరిజనులు 10 శాతం ఉన్నప్పటికీ వారి సమస్యలు, విద్య, ఆరోగ్యం వంటివి ఇంత వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రముఖ చారిత్రకారుడు, పద్మ విభూషణ్ గ్రహీత బాబాసాహెబ్ పురందరేను గురించి ప్రస్తావించారు. ఆయన ఈ రోజు ఉదయమే(సోమవారం) కన్నుమూశారని తనకు తెలిసిందన్నారు. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను ప్రజల వరకు తీసుకెళ్లడమన్నది ఎనలేనిదన్నారు. జంబోరీ మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. జంబోరి గ్రౌండ్‌లో 2 లక్షల మందికి సరిపోయేలా ఐదు మండల్స్ ఏర్పాటుచేశారు.
భోపాల్‌లో నిర్వహించిన జన్‌జాతీయ గౌరవ్ దివస్ సమ్మేళనానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తదితర ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున ప్రజానీకం కూడా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్స్ వంటివి కూడా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News