Wednesday, January 22, 2025

గిరిజనుడి ఆక్రోశం.. మధ్యప్రదేశ్ సర్కార్‌పై రూ.10,000కోట్ల దావా

- Advertisement -
- Advertisement -

ఇండోర్: తనను అక్రమకేసులో ఇరికించి జైలు పాలుచేసి, తన జీవితానికి తీరని నష్టం కల్గించినందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు రూ.10,000 కోట్లకు పైగా దావా వేశారు. ఓ సామూహిక మానభంగం ఘటనలో మధ్యప్రదేశ్‌లోని రట్లామ్‌కు చెందిన గిరిజనుడు కంటూ అలియాస్ కాంతీలాల్ భీల్ (35)కు అంతకు ముందు జరిగిన విచారణ క్రమంలో శిక్ష పడింది. దీనితో ఆయన 666 రోజులు జైలు శిక్ష అనుభవించాడు.

అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని గత ఏడాది అక్టోబర్ 22న తీర్పు వెలువడింది. తనను తప్పుడు అభియోగాలతో కేసులో ఇరికించి, ఎటువంటి సాయం లేని తనను రెండేళ్లకు పైగా జైలు గోడల మధ్య ఉంచారని ఈ గిరిజనుడు ఇందుకు ప్రతిగా తనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.10,006 కోట్ల పరిహారం అందాలని పిటిషన్ వేశారు. స్థానిక జిల్లా కోర్టులో ఆయన వ్యాజ్యానికి దిగారు. లైంగిక ఆనందం లేకుండా పోయినందుకు రూ.2 లక్షలు వెంటనే చెల్లించాలని కోరాడు. నమధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగారు. జీవితంలో ఇన్ని నాళ్లు దాంపత్యపు లైంగిక మాధుర్యం నష్టపొయ్యానని, దేవుడిచ్చిన జీవితపు క్రమంలోని అనుభవాన్ని కోల్పోయ్యానని, ఈ నష్టానికి ప్రభుత్వం లెక్కకట్టి ఇవ్వాలని పేర్కొన్నారు.

కేసు నుంచి తాను నిర్దోషిగా ఇప్పుడు బయటపడ్డా, తనకు జైలు కాలం పీడకలగా ఉందని, రేప్ కేసులో దోషిగా పేర్కొనడం తరువాత జైలుతో తన జీవితం అతలాకుతలం అయిందని వాపొయ్యాడు. తాను భార్యకు, పిల్లలకు, తన ముసలి తల్లికి దూరం అయి గడపాల్సి వచ్చిందని, తాను తన కుటుంబ సభ్యులు పలు రకాలుగా మానసిక వ్యధను అనుభవించాల్సి వచ్చిందని తెలిపారు. తాను జైలులో ఉండటంతో తన కుటుంబం చివరికి లోదుస్తులు కూడా కొనుక్కోలేని స్థితిలో గడిపింది. తాను జైలులో పలు రకాల బాధలు భరించాల్సి వచ్చింది.

జైలులో తనకు చర్మవ్యాధి సోకిందని, ఇతర జబ్బులు కూడా వచ్చాయని, తాను విడుదల అయి బయటికి వచ్చినా తనకు ఎప్పుడూ తలపోటు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగురు కుటుంబ సభ్యులకు తానే ఆధారం అని, తాను లేకుండా తన వారి పరిస్థితి ఏమిటనేది ఊహించుకుంటేనే వణుకు వచ్చేదని తెలిపారు. తన కేసులో ఓ లాయర్ ఉచితంగా వచ్చి వాదించడం వల్ల మొత్తం మీద బయట పడ్డానని, లేకపోతే తన పరిస్థితి, కుటుంబ పరిస్థితి దారుణం అయ్యేదని , తనకు జరిగిన అన్యాయానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సిందే అని ప్రభుత్వంపై కేసు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News