Friday, December 20, 2024

అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు

- Advertisement -
- Advertisement -
  • షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

ఫరూఖ్‌నగర్: గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక గిరిజన తండాల ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మొండోనిరాయితండా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సుగుణతో కలిసి శంకుస్థాప చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్షంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు, పట్టణాలతో సమానంగా అభివృద్ధి పథంలో పరుగుల పెడుతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు అనేక నిధులను మంజూరు చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చితిద్ది మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యస్థాపనే లక్షంగా సుపరిపాలన కొనసాగిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మూడో సారి అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్‌లు ఎన్ని కుయుక్తులు పన్నిన బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేరని దీమా వ్యక్తం చేశారు.

  • మొగిలిగిద్ద రంగంపల్లి గ్రామాల్లో పర్యటన

మొగిలిగిద్ద రంగంపల్లి గ్రామ పంచాయతీలల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వంటి పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు పలు అభివృద్ధి పనులను చేపట్టాలని కోరగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే గ్రామంలో మౌలిక వసతుల కల్పన, రోడ్డు, రవాణా సౌకర్యాల అంశాలను పరిష్కరిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఆయా గ్రామాల సర్పంచులు లలిత, శ్రీనివాస్, ఎంపిటిసి శ్రీశైలం, విజయలక్ష్మీ, నేతలు లావణ్య, మహేష్, రాకేష్. పాండు, రాములు, బాలునాయక్, బాబునాయక్, బుజ్జినాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News