Sunday, December 22, 2024

ఎసిబి వలలో ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ

- Advertisement -
- Advertisement -

రూ.84 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన జగజ్యోతి
ఆమె కార్యాలయం, ఇంట్లోను సోదాలు
పక్కా ప్రణాళికతోనే ఎసిబి దాడులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డ ఉదంతమిది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సోమవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్ర మంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధు లు నిర్వహిస్తోన్న జగ జ్యోతి ఎసిబి అ ధికారులకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

అధికారులు పట్టుకున్న అ నంతరం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. జగ జ్యోతిని కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవలే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించగా.. పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా వారం రోజుల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ ను సైతం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. పట్టాదార్ పాస్ బుక్ జారీ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి తహసీల్దార్ సత్యనారాయణ లంచం డిమాండ్ చేయగా, బాధితుని ఫిర్యాదుతో పక్కా ప్రణాళికతో ఎసిబి అధికారులు ఆ అధికారి పని పట్టారు. ఎంఆర్‌ఒ డ్రైవర్ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో తీసుకోమంటేనే తాను డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News