Monday, December 23, 2024

గిరిజన సంక్షేమ సంబురాలను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • శతాబ్ధి కాలంలో జరగని అభివృద్ధి సిఎం కెసిఆర్ పాలనలో దశాబ్ద కాలం
  • గిరిజన సంక్షేమ శాఖ వీడియో డాక్యుమెంటరీలో ప్రతి స్కీం ఉండాలి
  • మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో సంక్షేమ శాఖలో చేసిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో నిర్వహించే ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం మహబూబాబాద్ జిల్లా కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్ధ కాలంలో జరగని అభివృద్ధి సిఎం కెసిఆర్ పాలనలో దశాబ్ధ కాలంలో జరిగిందని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వీడియో డాక్యుమెంటరీ నిర్వహించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీం లబ్ధిదారులు, కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల చెక్కుల పంపిణీ చేయాలని తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో పోడు భూముల పట్టాల పంపిణీ చేసుకోబోతున్నాం. అదేవిధంగా దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను తండాల నుంచి జిల్లాల వరకు సమర్ధవంతంగా ఉపయోగించాలన్నారు.

గిరిజన విద్యా సంస్ధల్లో దశాబ్ధి ఉత్సవాల నిర్వహణను పండగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి, గ్రామ పంచాయితీ భవనాలను నిర్మించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. డాక్యుమెంటరీలో ప్రతి స్కీం ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, అధికారులు దశాబ్ధి ఉత్సవాల కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్‌లో సంక్షేమ శాఖ అధికారులు, గరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, గురుకుల సోసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఐటిడిఏ పివోస్, డిడిలు ఇతర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News