దేవస్(మధ్యప్రదేశ్): పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక గిరిజన మహిళను ఆమె భర్తతోసహా కొందరు గ్రామస్తులు నడివీధిలో బహిరంగంగా చితకబాదారు. అంతేగాక.. తన భర్తను భుజాలపై మోస్తూ గ్రామమంతా తిరిగే విధంగా ఆమెకు గ్రామస్తులు శిక్ష విధించారు. ఈ ఘోర సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాకు చెందిన బోర్పదావ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. నిందితులు ఆ మహిళ దుస్తులను చింపివేయడంతోపాటు ఆమెను దుర్భాషలాడుతూ ఘోరంగా అవమానించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి తొమ్మిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామస్తులు ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టడం.. తన భర్తను భుజాలపై మోస్తుండగా ఆమెను వారంతా దుర్భాషలాడుతూ, అవమానిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చాయి. ఒక వీడియో ఆ మహిళతోపాటు హరి సింగ్ భిలాలా అనే వ్యక్తికి చెప్పుల దండలు వేసి వారిని స్థానికులు అవమానిస్తున్న దృశ్యాలు కనిపించాయి. భిలాలా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళ భర్తతోపాటు మరో 8 మందిని అరెస్టు చేశారు.
In Madhya Pradesh's Dewas district, people brutally beat up a "Tribal Woman" just because she went with her lover. Aren't we living in a free country @ChouhanShivraj ?? What was her fault??
Where is NDA's candidate for President election, Draupadi Murmu?? Why is she SILENT?? pic.twitter.com/o3afyRtW6U
— Rajasthan Congress Sevadal (@SevadalRJ) July 4, 2022
Tribal Woman beaten with belt video goes viral