Wednesday, January 22, 2025

108లో గిరిజన మహిళ ప్రసవం

- Advertisement -
- Advertisement -

 

పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళను 108 వాహనంలో ఆదిలాబాద్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవించిన సంఘటన శుక్రవారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మారుగుడాకు చెందిన బైరబాయి పురిటి నొప్పులతో బాధపడుతుంది. కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 వాహనం ప్రసవ వేదనతో మహిళ తీవ్ర ఇబ్బంది పడుతుందని గ్రహించిన సిబ్బంది వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ కి తరలిస్తుండగా మండలంలోని పులిమడుగు గ్రామానికి సమీపంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రసవించినట్లు 108 సిబ్బంది తెలిపారు.

బాధిత మహిళ, చిన్నారిని ఇంద్రవెళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రసవ సమయంలో మహిళలు ఖచ్చితంగా ఇంటి వద్ద ఉండకుండా ఆస్పత్రి చేరాలని వైద్యులు సూచించారు. ప్రసవ సమయంలో సహకరించిన 108 సిబ్బంది శంకర్, పైలెట్ రాజేశ్ కు బాధిత కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News