Thursday, January 23, 2025

ఐఈడి బాంబు పేలి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బమార్క గ్రామానికి చెందిన సుక్కి అనే మహిళ మావోయిస్టుల దుశ్చర్యకు బలైంది. ఆదివారం ఆవులు మేపేందుకు అడవికి వెళ్ళింది. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతం మొత్తం కలకలం రేగడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News