Sunday, January 19, 2025

రాజస్థాన్‌లో గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించిన భర్త

- Advertisement -
- Advertisement -

జైపూర్: పర పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కోపంతో గర్భంతో ఉన్న ఏళ్ల గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించి ఆమెపై దాడి చేసిన ఆమె భర్తతోసహా 8 మంది వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతోసహా పౌర సంఘాల కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు.

తనను బలవంతంగా మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లి వివస్త్రను చేసి తనను ఊరేగించినట్లు బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆమె భర్త కన్హా గమేటీతోపాటు సూరజ్, బెనియా, నెతియా, మహేంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తం 10 మందిని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చినట్లు డిజిపి ఉమేష్ మిశ్రా శనివారం ఒక ప్రటకనలో తెలిపారు. ఈ నేరం జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర పోసించిన ఇద్దరు వ్యక్తులను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు ఆయన ఎప్పారు. పోలీసులు నిర్బంధించే సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి గాయపడిన కన్హా, నెతియా, బెనియాలను ప్రతాప్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు డిజిపి తెలిపారు.

బాధిత మహిళకు మరో వ్యక్తితో సంబంధాలు ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బాధిత మహిళను ఆమె అత్తమామలు గురువారం కిడ్నాప్ చేసి గ్రామానికి తీసుకెళ్లారని, అక్కడే ఈ దారుణం జరిగిందని ధరియావాడ్ పోలీసు స్టేషన్ అధికారి పేషావర్ ఖాన్ తెలిపారు. మరో వ్యక్తితో కలసి ఉంటున్నందుకు ఆమెపై అత్తమామలు కోపంతో ఉన్నారని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలకు సభ్య సమాజంలో తావులేదని ఆయన పేర్కొన్నారు. నిందితులందరినీ త్వరలోనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత వసుంధర రాజే కూడా ఈ ఘటనను ఖండించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయినప్పటికీ అధికార యంత్రాంగం దాన్ని గుర్తించలేకపోయిందని ఆమె విమర్శించారు.రాజస్థాన్‌ను ప్రపంచం ముందు సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరూ సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆమె పిలుపునిచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News