Tuesday, December 24, 2024

మానుకోటలో భారీ ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు గిరిజనుల సాంప్రదాయరీతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, డాక్టర్ సీతామహాలక్ష్మీల ఆధ్వర్యంలో అనంతారం గుట్టలపై నిర్మించిన సంత్ సేవాలాల్ ఆలయం వరకు గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. మేళతాళాలు, గిరిజన మహిళల నృత్యాల నడుమ అత్యంత వేడుకగా జరిగింది. ఈ ర్యాలీలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండిపై ఎమ్మెల్యే దంపతులు వెళ్లారు.

మహిళలతో కలసి వారు నృత్యాలు చేస్తూ ఉత్సహపరిచారు. అనంతరం ఆలయం వద్ద భోగ్ బండార్ కార్యక్రమాన్ని గిరిజన పూజారులు సాంప్రదాయరీతిలో భక్తిశ్రద్దలతో చేపట్టి సేవాలాల్ సేవలను కీర్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ ప్రియాంకతో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
పోలీసు ప్రధాన కార్యాలయంలో..
సద్గురు సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. సేవాలాల్ గిరిజనుల ఆరాధ్యదైవం భావిస్తూ అయన చేసిన చేసిన సేవాదృక్భధాన్ని వివరించారు. బంజారాల అభివద్ది కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, గిరిపుత్రులను అన్ని విధాలుగా చైతన్య పరుస్తూ జాతి సంరక్షణకు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిసిఆర్‌బి సీఐ బాలాజీ, వరప్రసాద్, ఐటీసెల్ సీఐ రవిరాజ్, ఎస్‌బి. సీఐ ఫణిధర్, ఆర్ లాల్ బాబు, ఏఓ జయరామ్, డిపివో, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలం రోటిబండ శివారు దూద్యతండాలో బుధవారం జంగిలిగొండ ఎంపీటీసీ కొండపల్లి రాంచంద్రమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకుల కొండపల్లి రాంచందర్‌రావు సేవాలాల్ సేవలను కీర్తించారు. కార్యక్రమంలో భూక్య చాంప్లా, మంగ్యా, బాబురావు, రమేశ్, భావ్‌సింగ్, బోడ చక్రి, వినోద, శ్రీను, సురేష్, సోన, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో..
సేవాలాల్ గిరిజనుల సంస్కృతికి ఆద్యుడని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి దార్ల శివరాజ్ అన్నారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అసెంబ్లీ అద్యక్షులు తోకల నాగరాజు అద్యక్షతన సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్ .విజయ్‌కాంత్, ఐతం ఉపేందర్, దారా ప్రసాదరావు, బొడ్డుపల్లి వీరస్వామి, జి. హేమంత్, సోని భాయి, లక్ష్మీ, శారద, జి. రమేశ్, భద్రు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం ఆధ్వర్యంలో..
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి సేవాలాల్ గిరిపుత్రులకు ఆరాధ్యదేవుడని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అంగోతు వెంకన్న, భూక్యా హరినాయక్, మాలోతు కిషన్‌నాయక్, బానోత్ వెంకన్ననాయక్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేలోతు సాయికుమార్, గుగులోతు సూర్యప్రకాశ్, ఉపేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News