Thursday, January 23, 2025

గిరిజనులు చైతన్యవంతం కావాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గిరిజనులను చైతన్యవందం చేసేందుకే గిరిజన చైతన్య యాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని మాజీ సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.

శనివారం హాలియాలోని పాత ఐటీఐ భవనంలో గిరిజన చైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనులు చైతన్యవంతం కావాల్సిన అవశ్యకత ఉందని, వారిని చైతన్యం చేసేందుకే కుందూరు జయవీర్‌రెడ్డి అధ్వర్యంలో ఈనెల 14 నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కర్నాటి లింగారెడ్డి, రాష్ట్ర నాయకులు కుందూరు జయవీర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షులు కుందూరు వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి నారాయణగౌడ్, జెడ్‌పీటీసీ నందికొండ రామేశ్వరమ్మ, అనుముల పాండమ్మ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గౌని రాజారమేష్‌యాదవ్, ప్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, పొదిల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News