Monday, January 20, 2025

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: మండలంలోని గిర్నిబావి మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో పాములపర్తి వెంకట నర్సింహారావు జయంతి వేడుకలను ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించగా చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు జన్మించారు. 2004 డిసెంబరు 23న మృతిచెందాడన్నారు.

పీవీ న్యాయవాదిగా, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారని, బహుభాషా వేత్త, రచయిత, ప్రధాని పదవిని అధిష్టించి మొదటి తెలుగువాడని, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్నారన్నారు. పీవీని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ ప్రభాకర్, డిప్యూటీ వార్డెన్ రాజు, ఉపాధ్యాయులు సుకుమార్, సోమారాణి, సురేష్, కోటి, కిరణ్, రమేశ్, బషీర్, వీరేందర్, కర్ణాకర్, కృష్ణమూర్తి, సందీప్, లక్ష్మణ్, సునీత, అనిత, పీఈటీ సతీష్, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News