Friday, November 22, 2024

తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో కాకాకు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దివంగత మహానేత, మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి ( కాకా) గ జయంతి సందర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , శాసన సభ వ్యవహారాల శాఖామంత్రి శ్రీధర్ బాబు , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీలు ఎమ్ యస్ ప్రభాకర్ రావు, కోదండరాం , జీవన్ రెడ్డి , దండే విట్ఠల్ , రఘోత్తమ్ రెడ్డి , ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ , గడ్డం వినోద్ , మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి , లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నేత గడ్డం వెంకటస్వామి అన్నారు. ఆయన కార్యకర్త స్థాయి నుండి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు. ఎప్పుడు కలిసినా పేద ప్రజల సమస్యల గురించి చర్చించేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఆయన గుర్తుచేశారు. ఆయన వారసులుగా వివేక్ , వినోద్ ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణిస్తూ పేద ప్రజల శ్రేయస్సు కోసం అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెజిస్లేచర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News