Friday, April 4, 2025

అమరవీరులకు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, కుడా ఛైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రిజ్వానా బాషా షేక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News