Friday, January 10, 2025

మంత్రి నిరంజన్ రెడ్డికి సత్కారం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తి ఆర్యవైశ్యులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పది లక్షల ప్రొసీడింగ్ కాపీని ప్రభుత్వం ద్వారా ఇప్పించారన్నారు.

ఈ సందర్భంగా వారు మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, సీనియర్ ఆర్యవైశ్యులు మారం బాలేశ్వరయ్య, పూరి బాలరాజ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్, గట్టు శశి, దాచ శివ కుమార్, వై.వెంకటేష్, వజ్రాల సాయి, బాబా, రామకృష్ణ, సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి, కె. మంజుల, ఉమావతి, పి. విజయలక్ష్మి, యువజన సంఘం అధ్యక్షులు బుచ్చు వెంకటేష్, మారం గోవింద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News