Monday, November 25, 2024

గజ్వేల్‌లో కొవ్వొత్తుల ర్యాలీతో సాయి చంద్‌కు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: గుండె పోటుతో నిన్నటి రోజు హఠాన్మరణం చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ మృతిపై గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈనేపధ్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి పెద్దఎత్తున సాయి చంద్‌ను స్మరిస్తూ యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా పార్కు వరకు సాగిన ఈ ర్యాలీలో సాయి చంద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయి చంద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు నవాజ్ మీరా , పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సాయి చంద్‌కు మున్సిపల్ పాలక వర్గం ఘన నివాళి

ప్రముఖ జానపద గాయకుడు, రాష్ట్ర గ్డింగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మృతిపై గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చే సింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో ఛైర్మన్ ఎన్సీ రాజమౌ ళి గుప్తా అధ్యక్షతన పాలకవర్గం సమావేశమై సాయిచంద్‌కు ఘనంగా నివాళి అర్పించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ ఎంతో గొప్ప కళాకారున్ని , ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకున్ని తెలంగాణరాష్ట్రం కోల్సోయిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాయి చంద్ పాటల ప్రభావం ప్రజలు, పాలకులపై ఎంతో చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండునిముషాలు మౌనం పాటించారు. వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్, కమీషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు బబ్బురి రజితా గౌడ్, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, దుంబాల లక్ష్మీ కిషన్‌రెడ్డి, పంబాల అర్చన శివకుమార్, శీర్ల శ్యామల మల్లేశ్ యాదవ్, మామిడి విద్యారాణి శ్రీధర్, గంగి శెట్టి చందన రవిందర్, తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, షహనవాజ్ సమీర్, అల్వాల బాలేష్, అత్తెలి శ్రీనివాస్, ఉప్పల మెట్టయ్య, రహీం, బొగ్గుల చందు, కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, గంగి శెట్టి రాజు, షరీఫా ఉమర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News