Monday, December 23, 2024

సాయిచంద్‌కు ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఎంతో ఉజ్జలమైన భవిష్యత్ గల వేద సాయిచంద్ గుండెపోటులో హఠాన్మరణం చెందడం యావత్ తెలంగాణ ఉద్య మకారుల హృదయాలను కలచి వేసిందని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం హస్తినా పుర ంలోని జిఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ దివంగత వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన పుడ్ కమీష న్, బిసి కమిషన్ సభ్యులతో కలిసి పాల్గొని, సాయిచంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో లక్షలాది ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయించారంటూ సాయిచంద్‌తో కలిసి ఉద్యమం లో పాల్గొన్న ఘటనలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సాయిచంద్ తండ్రిని, కుటుంబ సభ్యులను పరామర్శించి, సాయిచంద్ కుటుంబానికి ఎల్లవే ళలా అండగా ఉంటామన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు ఓ రుగంటి ఆనంద్, బిసి కమిషన్ సభ్యులు ఉపేందర్, రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News