ఎల్బీనగర్ : బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోల్‌లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఉద్యమకారుడు కుంట్లూర్ వెంకటేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఉద్యమ కారులు ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించకోవడం జరిగిందన్నారు. ఉద్యమ బలిదానంలో శ్రీకాంత్‌చారి పాత్ర కీలకైమందని, రాష్ట్రం కోసం బలిదానం ఎంతో బాధాకరమని అన్నారు. శ్రీకాంతచారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. అనంతరం శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ మాజీ ఇంఛార్జ్ కాచం సత్యనారయణగుప్తా, పుటం పురుషోత్తం, శ్రవణ్‌గుప్తా, సాగర్‌రెడ్డి, దాము మహేందర్ యాదవ్, నర్రే శ్రీనివాస్, శ్రవణ్‌గుప్తాలు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ముగింపు సందర్భంగా అమరుల సంస్మరణ కార్యక్రమానికి సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం నుంచి భారీ ర్యాలీగా ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్వర్యంలో సచివాలయం వరకు తరిలివెళ్లారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఉద్యమ కారులు , మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.