Monday, December 23, 2024

సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్యకు నివాళులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలిఅమరుడు దొడ్డికొమురయ్య , నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా దొడ్డికొమురయ్య కాంస్య విగ్రహానికి ఎస్‌పి రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ప్రజా స్వామ్య పరిరక్షణకై తెలంగాణ సాయుధ పోరాటాన్నీ నిర్వహించిన యోధుడన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ తొలితరం ఉద్యమానికి ఊపిరి ఊదిన మహానీయుడు దొడ్డి కొమురయ్య అన్నారు.

డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం సాగించిన సమరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని దొడ్డి కొమురయ్య అమరత్వమే తిరగబడే పిడికిలి అయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, కురుమ సంఘం నాయకులు మీనాక్షి సాయికుమార్, డాక్టర్ శ్రీహరి, బీరయ్య యాదవ్, కిష్టయ్య, లాడే మల్లేశం, ప్రభాకర్, ప్రదీప్‌యాదవ్, బిఆర్‌స్ నాయకులు నక్క నాగారాజుగౌడ్, జలేంధర్‌రావు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News