హన్మకొండ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అదాలత్ సెంటర్ లో అమరవీరుల స్థూపంకు నివాళులు అర్పించారు.
తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి,నగర మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాష షేక్ మరియు తదితరులు పాల్గొన్నారు.