- Advertisement -
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే వెల్లడి
ముంబై : మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అందుబాటు కాలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శనివారం వెల్లడించారు. ఎఫ్‌ఐసిసిఐ , సిఐఐ వంటి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో థాకరే వీడియో కాన్ఫరెన్సు ద్వారా శనివారం మాట్లాడారు. ఈ విషయంలో కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తోందని చెప్పారు. మూడో కరోనా వేవ్ సంభవిస్తే ఆర్థికంగా ఎలాంటి దుష్ప్రభావం లేకుండా ఉండడానికి కొవిడ్‌కు అనుగుణంగా పని విధానాన్ని రూపొందించాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి పారిశ్రామిక రంగానికి సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చెప్పారు.
- Advertisement -