Monday, December 23, 2024

బిజెపి విషయంలో మెత్తబడుతున్న తృణమూల్ కాంగ్రెస్!

- Advertisement -
- Advertisement -

 

TMC going soft on BJP

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోగా కేవలం తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మాత్రం ప్రధాన పార్టీలుగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పెడదారిలో బిజెపి నిలబెట్టిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికింది. తాము గిరిజన సమూహానికి చెందిన మహిళకు మద్దతునిస్తున్నామని తమ వైఖరిని చాటింది. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా గైర్హాజరు అయింది. తృణమూల్ వైఖరి ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని పదేపదే చాటుతూ వస్తోంది. బెంగాల్ మాజీ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్‌ను బిజెపి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది. ప్రతిపక్షాల నిర్ణయం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతిసారి దూరం జరుగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ధనకర్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చిందన్నది స్పష్టం. ఆగస్టు నెల మొదట్లో మమతా బెనర్జీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని అదనపు కేంద్ర నిధులను కోరింది. అంతేకాక ఆమె నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌కు కూడా టంచనుగా హాజరయింది. పైకి మాత్రం కేంద్ర విధానాలను విమర్శిస్తూ తన తీరును ప్రదర్శించింది.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన క్యాబినెట్ మినిస్టర్ పార్థా చటర్జీని ఓ స్కామ్‌లో ఈడి అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో భేటి అయి ఓ అవగాహనకు వచ్చిందని ఆమె రాజకీయ వ్యతిరేకులు అంటున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ముస్లింల అంశాలలో కానీ, దుర్గా పూజా విషయంలో కానీ ఇతరులను ఆకట్టుకోలేకుండా వ్యవహరిస్తోంది. కాగా ఆమె స్వరాష్ట్రంలోనే ఆమె పార్టీ ప్రముఖులను కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకుంటున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బెంగాల్‌కు నిధులు రాకుండా రెగ్యులేట్ చేస్తోంది. దాంతో ప్రజా ఖర్చులకు కటకటా ఏర్పడుతుంది.

గతంలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్‌డిఏ, యూపిఏలలో కూడా భాగస్వామిగా ఉండేది. ఇప్పుడు బిజెపికి తలొగ్గి పనిచేస్తోంది. దాంతో కాంగ్రెస్‌కు దూరం అవుతోందినిపిస్తోంది. ఒకవేళ తృణమూల్ తప్పటడుగు వేస్తే దాని ఫలితం 2019 మాదిరి ఉండగలదు. అప్పట్లో బెంగాల్‌లోని దాదాపు సగం లోక్‌సభ సీట్లను బిజెపి కైవసం చేసుకుంది. ప్రస్తుతం 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ తీరు గమనించాల్సిన రీతిలో ఉంది. బిజెపితో దాని వైఖరి ఏమిటన్నది తేలాల్సి ఉంది. పరోక్షంగా బిజెపికి మద్దతు ఇస్తూ ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకటిగా ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే బెంగాల్ ఓటర్లు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వారు తృణమూల్, బిజెపి సర్దుకుపోవడాన్ని అంగీకరిస్తారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News