Saturday, November 9, 2024

తృణమూల్ ఒంటరి పోరాటం

- Advertisement -
- Advertisement -

42 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

బరిలో మాజీ క్రికెటర్లు పఠాన్, కీర్తి అజాద్, నటి రచన

కొల్‌కతా : లోక్‌సభ ఎన్నికలకు మమత బెనర్జీ సారధ్యపు తృణమూల్ కాంగ్రె స్ (టిఎంసి) పార్టీ ఆదివారం తమ అభ్యర్థుల జాబితాను వెలువరించింది. ఒకేసారి మొత్తం 42 స్థానాలకు పేర్లు ప్రకటించిన క్రమంలో జాబితాలో పలు విస్మయకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడున్న ఏడుగురు సిట్టిం గ్ ఎంపిలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. పలువురు కొత్తవారికి సీట్లు కల్పించారు. వీరిలో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ , కీర్తి ఆజాద్ కూడా ఉన్నారు. కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించినబెంగాలీ నటి రచనా ముఖర్జీకి హుగ్లీ ఎంపి సీటు ఇచ్చారు. కాగా ఆదివారం స్థానిక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బ్రహ్మండమైన ర్యాలీలో పార్టీ అధినేత్రి మమత బెనర్జీ ప్రసంగించారు. జాబితా వెలువడింది. కొందరు కొత్తవారికిస్థానం కల్పించామని, కొందరు పాతవారికి ఇవ్వలేదని, అయితే టికెట్లు రానివారికి అసెంబ్లీ ఎన్నికలలో స్థానం కల్పించడం జరుగుతుందని అనునయించారు.

పార్టీ అభ్యర్థుల జాబితా ద్వారా ఆమె ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచార సమరం ఆరంభించినట్లు అయింది. అనుభవజ్ఞులైన నేతలు, సరికొత్త ఆలోచనలు, ప్రతిభ గల వారికి కూడా చోటుకల్పిస్తూ తమ జాబితా పాతకొత్తల మేలుకలయికగా ఉందని టిఎంసి అధికారిక ప్రకటనలో తెలిపింది. పార్టీలో పాతనేతలు, కొత్తతరం నేతలకు మధ్య అంతర్గతంగా వివాదం తలెత్తుతు న్న దశలో పార్టీ నిర్ణయాత్మక రీతిలో జాబితా తీసుకువచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికలలో తాము ఒంటరి పోరుకే వెళ్లుతున్నామనే విషయాన్ని టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబితాను వెలువరించడం ద్వారా ప్రకటించారు. మరో వైపు కాంగ్రెస్‌కు, ఇండియాకు షాక్ ఇచ్చారు. సినీనటుడు, రాజకీయ షాట్‌గన్ శతృఘ్న సిన్హాకు ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపిగా ఉన్న అసనాల్ సీటునే తిరిగి కేటాయించారు. మాజీ ఎంపి హాజీ నూరుల్ ఇస్లామ్‌కు బసిర్హట్ స్థానం ఇచ్చారు. ఇక్కడ యాక్టర్ నుస్రత్ జహాన్‌కు టికెట్ నిరాకరించారు.ఈ స్థానం సమస్యాత్మక సందేశ్‌ఖలీ ప్రాంతంలో ఉంది. కాగా 23 మంది సిట్టింగ్‌లలో 16 మంది పాతవారే ఉన్నారు. ఏడుగురిని దూరం పెట్టారు. వీరిలో బిజెపి నుంచి పార్టీలోకి ఫిరాయించిన అర్జున్‌సింగ్‌ను బరాక్‌పూర్ నుంచి తప్పించారు.

మొత్తం అభ్యర్థులలో కొత్త వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇప్పుడు సిట్టిం గ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తొమ్మండుగురికి కూడా ఎంపిలుగా అవకాశం ఇచ్చా రు. వీరితో ఇద్దరు రాష్ట్ర మంత్రులు పార్థా భౌమిక్, విప్లవ్ మిత్ర కూడా ఉన్నారు. పార్టీ ఈసారి వీరికి జాతీయ రాజకీయ పాత్రను కల్పించనుంది. ఇప్పు డు క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను టిఎంసి బహరంపూర్ స్థానం నుంచి లోక్‌సభ క్రీజ్‌లోకి దింపింది. కాగా మరో ప్రముఖ క్రికెటర్ కీర్తి ఆజాద్‌ను ఇప్పు డు బిజెపి సిట్టింగ్ ఎంపి ఉన్న బర్థమాన్‌దుర్గాపూర్ స్థానం నుంచి నిలబెట్టారు. కాగా ప్రశ్నకు డబ్బుల కేసులో లోక్‌సభ అనర్హత వేటుకు గురైన మహూవా మొయిత్రాను తిరిగి కృష్ణానగర్ స్థానం నుంచి పోటీకి దింపారు. ఇక ఎమ్మెల్యేలలో ఈసారి టిఎంసి ఎంపి సీట్లు దక్కినవారిలో ఎక్కువ మంది ఇటీవల బిజెపి నుంచి పార్టీ ఫిరాయించి వచ్చిన వారే ఉన్నారు. టిఎంసి జాబితాలో రాజకీయాల్లోకి కొత్తవారు, దాదాపుగా మూడు టర్మ్‌లు ఎన్నికైన ఎంపిలు సుదీప్ బంధోపాధ్యాయ, సౌగతా రాయ్, శతాబ్ధిరాయ్ , కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్ దస్తదర్ వంటివారు కూడా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News