హైదరాబాద్: త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండో రోజుల క్రితం చనిపోయింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించలేదని ఆమెతో ఉన్న నటుడు చంద్రకాంత్ తెలిపారు. ఓ ఇంటర్వూలో పవిత్ర గురించి చెబుతూ బోరున విలపించాడు. కన్నడంలో ఓ సినిమా కోసం సంతకం చేసేందేకు తాము బెంగళూరుకు వెళ్లాడు. ప్రాజెక్టు ఒప్పుకొని కొంత అడ్వాన్స్ తీసుకొని కారులో హైదరాబాద్‌కు వస్తున్నామన్నారు. కారులో తాను, పవిత్ర వెనుక సీట్లో కూర్చున్నామని, డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉందని పేర్కొన్నారు.
తాము గాఢ నిద్రలో ఉన్నపుడు బస్సు తమ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో కారు డివైడర్‌ను ఢీకొట్టిందన్నారు. తాను తీవ్రంగా గాయపడ్డానని, పవిత్రకు దెబ్బ తగలలేదని తెలిపారు. తాను రక్తపు మడుగులో కనిపించడంతో పవిత్ర షాక్‌లోకి వెళ్లిపోయిందని, అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఆమె చనిపోయిందన్నారు. అంబులెన్స్ సమయానికి వచ్చి ంపటే పవిత్ర బతికేదని, హార్ట్ ఎటాక్‌తోనే ఆమె చనిపోయిందని చంద్రకాంత్ స్పష్టం చేశారు. పవిత్ర నేను భార్యభర్తలమని అధికారికంగ చెబుదామనుకున్నామని, ఇంతలోనే తనని మోసం వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా జీవితం ఎటు కాకుండా పోయిందని, ఆ దేవుడు ఆమెను అలాగే ఉంచి తనను తీసుకెళ్లినా బాగుండు’ అని చెప్పారు. పవిత్ర గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని నెటిజన్లను కోరారు.