Monday, December 23, 2024

ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక త్రిబుల్ ఐటీని ఏర్పాటు చేయాలి : ఐఎస్‌యు డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక త్రిబుల్ ఐటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ స్టూడెంట్ యూనియన్ (ఐఎస్‌యు) డిమాండ్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేష్‌లో అప్పటి ప్రభుత్వం అదిలాబాద్ జిల్లా బాసరలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన త్రిబుల్ ఐటీ అనేక సమస్యల తో కొట్టుమిట్టాడుతోందని ఐఎస్‌యు జాతీయ అధ్యక్షులు పాపని నాగరాజు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరిస్తూనే ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున త్రిబుల్ ఐటీ లాంటి విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సాంకేతిక, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు వెళ్లాలంటే వాటి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని, పూర్తి స్థాయిలో నియామకాలు కల్పించాలని ఆయన కోరారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఆధునీకత, చేతివృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధి కేంద్రాలు ఏకకాలంలో అభివృద్ధి అయితే దేశం, రాష్ట్రము అభివృద్ధి చెందుతుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించలేని, సౌకర్యాలు లేనటువంటి అనేక విద్యాసంస్థల కారణంగా వివిధ రకాల కార్పొరేట్ ప్రైవేటు సాఫ్ట్ వేర్ రంగాలలో ఉపాధి అవకాశాలకు లేకుండా పోతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు అభివృద్ధికి దోహదపడే విధంగా విద్యాభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News