Monday, December 23, 2024

ట్రిపుల్ రైడింగ్‌లో మైనర్ బాలుడు మృతి..

- Advertisement -
- Advertisement -

మాదన్నపేట్‌ః మైనర్లకు వాహనాలు ఇవ్వదని పోలీసులు ఎంత చెప్పిన తల్లిదండ్రులు మాత్రం వినిపించుకోవడం లేదు. ట్రిపుల్ రైడింగ్‌లో ఓ మైనర్ బాలుడు చనిపోవడమే కాకుండా ఓ మహిళాకు మరో ఇద్దరు మైనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట యూసిఫీయాన్ కాలనీకి చెందిన అహ్మద్ షరీఫ్ రిటైర్డ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్. తన కూతురి కుమారుడైన ఎండి ఫైజాన్(17) తాత దగ్గరనే ఉంటున్నాడు.

ఫైజాన్ స్నేహితులైన షేక్ సోహెల్(17), మహ్మద్ అలీ(16) ద్విచక్ర వాహనం పై ఫైజాన్ ఇంటికి వచ్చారు. ఒకే వాహనం పై ముగ్గురు కలిసి బయటికి వెళ్లారు. ఫిసల్‌బండా ఎస్‌బిఐ బ్యాంక్ వద్దకు రాగానే రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంతో కింద పడ్డారు. దీంతో ఫైజాన్ డివైడర్ పై పడటంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మీ(47) అనే మహిళకు కూడా గాయాలయ్యాయి. షేక్ సోహెల్, మహ్మద్ అలీలు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఓవైసీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News