Sunday, January 19, 2025

మైనర్ భార్య తల, మొండెం వేరు చేసి…

- Advertisement -
- Advertisement -

అగర్తాలా: మైనర్ భార్యను చంపి మొండెం, తల వేరు చేసి బ్యాగ్‌లో మూట కట్టి వేర్వేరు ప్రదేశాల్లో పడేసిన సంఘటన త్రిపుర రాష్ట్రం అగర్తాలాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎనిమిది నెలల క్రితం తనూజ బేగమ్(15) అనే బాలిక కయిమ్ మియా అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. గత శుక్రవారం నుంచి తన కూతురు కనిపించకపోవడంతో తన అల్లుడి ఇంటికి ముస్లిమ్‌పూర్‌కు వెళ్లింది. తన కూతురు ఇంటిలోకి వెళ్లి చూడగా రక్తపు మరకలు కనిపించడంతో బోరున విలపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్తను కొన్ని గంటలలోనే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆమెను హత్య చేసి తల, మొండెం వేరు చేసి బ్యాగ్‌లో పెట్టి వేర్వేరు ప్రదేశాలలో పడేశానని వివరించాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మరో వ్యక్తి ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News